
మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న కొత్త చిత్రం ‘మిస్టర్ బచ్చన్’ తాజాగా వాలెంటైన్స్ డే స్పెషల్ పోస్టర్‌తో మళ్లీ ట్రెండ్ సృష్టించింది. దర్శకుడు హరీష్ శంకర్ మాస్ యాక్షన్ మరియు ఎమోషనల్ లవ్ ట్రాక్‌ల మేళవింపుతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు.
భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తుండగా, వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదలైన పోస్టర్లో రవితేజ – భాగ్యశ్రీ జంట ఆప్యాయంగా కౌగిలించుకున్న రొమాంటిక్ లుక్‌లో కనిపించారు. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో భారీ స్థాయిలో వైరల్ అవుతోంది.
Thank you for reading this post, don't forget to subscribe!ఈ చిత్రం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే కారంపూడి షెడ్యూల్ పూర్తి కాగా, ప్రస్తుతం షూటింగ్ తుదిదశలో కొనసాగుతోంది.
“నామ్ తో సునా హోగా” అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ చిత్రం, రవితేజ కెరీర్లో మరో మాస్ ట్రీట్ కానుంది. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తుండగా, అయనంక బోస్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.
సినిమా యొక్క ప్రొడక్షన్ డిజైన్ అవినాష్ కొల్లా, ఎడిటింగ్ బాధ్యతలు ఉజ్వల్ కులకర్ణి నిర్వహిస్తున్నారు. ఈ చిత్రానికి పనోరమా స్టూడియోస్ & T-సిరీస్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నాయి.
🎬 తారాగణం:
రవితేజ, భాగ్యశ్రీ బోర్సే
🎥 సాంకేతిక విభాగం:
దర్శకత్వం: హరీష్ శంకర్
నిర్మాత: టీజీ విశ్వప్రసాద్
సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల
సంగీతం: మిక్కీ జె మేయర్
డీవోపీ: అయనంక బోస్
ఎడిటింగ్: ఉజ్వల్ కులకర్ణి
ప్రొడక్షన్ డిజైన్: అవినాష్ కొల్లా
పీఆర్ఓ: వంశీ – శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో