RTI చట్టం: చట్టాన్ని ఉల్లంఘించిన అధికారులకు కఠిన శిక్షలు – పౌరుల హక్కులను రక్షించే ఆయుధం .ప్రజలకు సమాచారం తెలుసుకునే హక్కు రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(a) ద్వారా హామీ ఇవ్వబడింది. ఈ హక్కును బలపరచడానికి RTI 2005 లో సమాచార హక్కు చట్టం (RTI Act) తీసుకొచ్చారు. కానీ, చాలామంది అధికారులు ఈ చట్టాన్ని నిర్లక్ష్యం చేస్తూ, పౌరులు అడిగిన ప్రశ్నలకు తప్పుదారి పట్టించే సమాధానాలు ఇస్తున్నారు లేదా సమాచారం దాచేస్తున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ (CIC) మరియు స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ (SIC) లకు విస్తృతాధికారాలు ఉన్నాయి. అవి కేవలం సమాచారాన్ని ఇవ్వమని మాత్రమే కాదు, తప్పు చేసిన RTI అధికారులపై కఠిన చర్యలు తీసుకునే శక్తిని కూడా కలిగి ఉన్నాయి.
RTI ముఖ్య న్యాయ నిర్ణయాలు:
1. Lalita Kumari v. Govt. of UP (2014) – పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు వచ్చిన వెంటనే, అది సంజ్ఞాపన (Cognizable offence) అయితే తప్పనిసరిగా FIR నమోదు చేయాలి అని సుప్రీంకోర్టు స్పష్టతనిచ్చింది.
2. Ministry of Railways v. Girish Mittal (Delhi HC, 2014) – తప్పుడు/తప్పుదారి పట్టించే సమాచారం ఇచ్చినా, కమిషన్ నేరుగా జరిమానా విధించవచ్చు అని ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇచ్చింది.
3. Rakesh Kumar Singh v. Lok Sabha Secretariat (CIC, 2006) – తప్పు సమాచారం ఇవ్వడం అంటే సమాచారం ఇవ్వకపోవడమే. అటువంటి సందర్భాల్లో గరిష్ట జరిమానా విధించాలి అని CIC నిర్ణయించింది.
4. RK Jain v. DIT (CIC, 2007) – ఫస్ట్ అప్పిలేట్ అథారిటీ (FAA) తగిన విధంగా మాట్లాడే ఆర్డర్ ఇవ్వకపోవడం చట్టపరమైన బాధ్యతలో నిర్లక్ష్యంగా పరిగణించబడుతుంది.
జరిమానా మరియు పరిహారం:
జరిమానా (Penalty) – సంబంధిత PIO (Public Information Officer) వ్యక్తిగతంగా చెల్లించాలి. గరిష్టంగా ₹25,000/- వరకు విధించవచ్చు.
పరిహారం (Compensation/Punitive damages) – ఇది అప్లికెంట్ (సమాచారం కోరిన పౌరుడు) కు ఇవ్వాలి. RTI చట్టంలోని Sec. 19(8)(b) ప్రకారం, మానసిక హింస, సమయం వృథా, న్యాయం ఆలస్యం వంటివాటికి పరిహారం ఇవ్వాలని కమిషన్ ఆదేశించవచ్చు.
వ్యవస్థాత్మక మార్పులు అవసరం:
– పోలీస్ ఫిర్యాదులను తక్షణమే GD/FIRలో నమోదు చేయాలి.
– ఫిర్యాదుదారుకు సర్టిఫైడ్ కాపీలు ఇవ్వాలి.
– RTI అభ్యర్థులను బెదిరించే అధికారులపై కఠిన చర్యలు తప్పనిసరి.
RTI చట్టం ఒక సాధారణ చట్టం మాత్రమే కాదు; ఇది ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే శక్తివంతమైన ఆయుధం. ప్రతి పౌరుడు దీన్ని సక్రమంగా ఉపయోగించి, తప్పుడు అధికారులను బహిర్గతం చేస్తేనే పారదర్శకత, జవాబుదారీ పాలన సాధ్యం అవుతుంది.
https://rtionline.gov.in/request/request_email_check.php?pageid=c81e728d9d4c2f636f067f89cc14862c
-BY VEERAMUSTI SATHISH,MAJMC
READ MORE :
https://prathipakshamtv.com/right-to-information-act-complete-guide-rti-india/
Online RTI : సమాచార హక్కు చట్టం 2005 | Complete Guide
