భారతదేశంలోనే అతి పెద్ద విద్యా పథకాలలో ఒకటైన ఎస్బీఐ ప్లాటినం జూబిలీ ఆశా స్కాలర్షిప్ 2025-26 ఇప్పుడు అర్హులైన విద్యార్థుల కోసం అందుబాటులోకి వచ్చింది. ఈ పథకాన్ని ఎస్బీఐ ఫౌండేషన్ ప్రారంభించింది. దీని ముఖ్య ఉద్దేశ్యం ఆర్థికంగా బలహీన వర్గాల నుంచి వచ్చిన ప్రతిభావంతులైన విద్యార్థులకు నాణ్యమైన విద్యను కొనసాగించేందుకు ఎస్బీఐ ఆర్థిక సాయం అందించడం.
ఈ పథకం కింద పలు విభాగాల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు:
పాఠశాల విద్యార్థులు (9వ తరగతి నుండి 12వ తరగతి వరకు)
అండర్గ్రాడ్యుయేట్ విద్యార్థులు
పోస్ట్‌గ్రాడ్యుయేట్ విద్యార్థులు
మెడికల్ విద్యార్థులు
ఐఐటీ విద్యార్థులు
ఐఐఎమ్ విద్యార్థులు
విదేశీ విద్యార్థులు
అవార్డు వివరాలు:
స్కాలర్షిప్ మొత్తం ₹15,000 నుండి గరిష్టంగా ₹20 లక్షల రూపాయల వరకు ఉంటుంది.
ప్రతి సంవత్సరం విద్యార్థులు కనీస అర్హత ప్రమాణాలు కొనసాగిస్తేనే రిన్యూవల్ ఔతుంది .
అర్హత ప్రమాణాలు:
గత విద్యా సంవత్సరంలో 75% మార్కులు లేదా 7 CGPA సాధించి ఉండాలి.
SC/ST అభ్యర్థులకు 10% వరకు సడలింపు (67.50% లేదా 6.30 CGPA).
కుటుంబ వార్షిక ఆదాయం:
పాఠశాల విద్యార్థులకు ₹3 లక్షల వరకు.
మిగిలిన వర్గాలకు ₹6 లక్షల వరకు.
50% స్కాలర్షిప్ స్థానాలు మహిళలకు రిజర్వ్.
50% స్థానాలు SC/ST విద్యార్థులకు రిజర్వ్.
అవసరమైన పత్రాలు:
గత విద్యా సంవత్సరపు మార్క్‌షీట్
ఆధార్ వంటి ప్రభుత్వ గుర్తింపు కార్డు
ప్రస్తుత సంవత్సరం ఫీజు రసీదు
బ్యాంక్ ఖాతా వివరాలు
ఆదాయ ధృవీకరణ పత్రం
అడ్మిషన్ ప్రూఫ్ (అడ్మిషన్ లెటర్/ఐడీ కార్డు/బోనాఫైడ్ సర్టిఫికేట్)
ఫోటో
కుల ధృవీకరణ పత్రం (అవసరమైతే)
ముఖ్యమైన తేదీలు:
అప్లికేషన్ ప్రారంభం: 19 సెప్టెంబర్ 2025
చివరి తేదీ: 15 నవంబర్ 2025
దరఖాస్తు విధానం:
Apply Now బటన్‌పై క్లిక్ చేయండి.
రిజిస్టర్ అవ్వండి లేదా లాగిన్ అవ్వండి.
అప్లికేషన్ ఫారమ్ పూరించండి.
అవసరమైన పత్రాలు అప్లోడ్ చేయండి.
టర్మ్స్ అండ్ కండిషన్స్ అంగీకరించి Submit చేయవలసి ఉంటుంది
ఎస్బీఐ ఇమెయిల్: sbiashascholarship@sbifoundation.co.in
📞 హెల్ప్‌లైన్: 011-430-92248 (సోమవారం–శుక్రవారం, ఉదయం 9:00 AM – సాయంత్రం 6:00 PM వరకు)
ఎస్బీఐ ప్లాటినం జూబిలీ ఆశా స్కాలర్షిప్ 2025-26 పథకం ద్వారా వేలాది మంది విద్యార్థులు ఆర్థిక అడ్డంకులు లేకుండా ఉన్నత విద్య కొనసాగించవచ్చు. ఇది విద్యార్థుల భవిష్యత్తును మార్చే ఒక గొప్ప అవకాశం.
-BY VEERAMUSTI SATHISH ,MAJMC
https://sbi.bank.in/#mainsection
READ MORE:
https://prathipakshamtv.com/%e0%b0%8e%e0%b0%b8%e0%b1%8d%e0%b0%ac%e0%b1%80%e0%b0%90-%e0%b0%95%e0%b1%8d%e0%b0%b2%e0%b0%b0%e0%b1%8d%e0%b0%95%e0%b1%8d-%e0%b0%89%e0%b0%a6%e0%b1%8d%e0%b0%af%e0%b1%8b%e0%b0%97%e0%b0%be/

