సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రాంగణంలో భారీ మార్పులు కనిపిస్తున్నాయి. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా ఈ రైల్వే స్టేషన్ ప్రపంచస్థాయి సౌకర్యాలతో తీర్చిదిద్దేందుకు దాదాపు ₹714.73 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మొత్తం ప్రాజెక్ట్‌లో 46 శాతం పనులు పూర్తయ్యాయని రైల్వే శాఖ అధికారులు తెలిపారు.
ఈ ప్రాజెక్టు కింద ప్రయాణికులకు ఉన్నతమైన మరియు ఆధునిక సౌకర్యాలు అందించేందుకు ఆకృతీకరణ జరుగుతోంది. రైల్వే స్టేషన్ లోపల స్మార్ట్ వేటింగ్ ఏరియా, అధునాతన ఫుడ్‌కోర్ట్స్, స్కైవాక్, మల్టీ లెవల్ కనెక్టివిటీ, సులభమైన ట్రాన్స్పోర్ట్ యాక్సెస్ వంటి పలు అంశాలు ఇందులో భాగమవుతున్నాయి.
ముఖ్య లక్ష్యాలు:
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మోడల్ స్టేషన్‌గా మార్చడం
ప్రయాణికులకి వేగవంతమైన, సౌకర్యవంతమైన రవాణా సదుపాయం కల్పించడం
హైదరాబాద్ సిటీ ట్రాన్సిట్ నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేయడం
పనుల పురోగతిని పరీక్షిస్తున్న ఇంజినీరింగ్ టీములు, కాంట్రాక్ట్ సంస్థలు రోజువారీగా వర్క్ షెడ్యూల్ అమలు చేస్తున్నాయి. ట్రెక్కులు, పాసింజర్ యాక్సెస్ జోన్లు, ఎలక్ట్రికల్-మెకానికల్ అప్‌గ్రేడ్ మొదలైన విభాగాల్లో ఒకేసారి పనులు కొనసాగుతున్నాయి.
ఈ మెగా ప్రాజెక్ట్ పూర్తి అయితే, సికింద్రాబాద్ మాత్రమే కాదు – మొత్తం దక్షిణ మరియు మద్య భారత రైల్వే నెట్‌వర్క్‌పై కూడా పాజిటివ్ ఇంపాక్ట్ ఉండనుంది. ప్రయాణికులకు సౌకర్యాలు పెరగడంతో పాటు, నగర అభివృద్ధికి ఇది ఒక కొత్త మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది.
Secunderabad – Live Arrivals/Departures – Railway Enquiry
-BY VEERAMUSTI SATHISH, MAJMC
READ MORE:

