తెలంగాణ రాష్ట్రంలో రైతు రుణమాఫీ అమలుపై ప్రభుత్వం తీవ్ర కసరత్తులు చేస్తోంది. ఇందులో భాగంగానే బ్యాంకుల నుంచి రైతులు తీసుకున్న అప్పును మాఫీ చేయడానికి విధివిధానాలు ఖారారు చేసే పనిలో ఉంది రేవంత్ ప్రభుత్వం . ఆగస్టు 15వ తేదీలోపు ఈ రుణమాఫీ క్లోజ్ చేయాలని ప్రభుత్వా అధికారులు భావిస్తున్నారు. రైతుల శ్రేయస్సు కోసం ఆలోచన చేస్తున్న సీఎం రేవంత్.. రైతు రుణమాఫీపై ప్రత్యేక శ్రద్ద పెట్టారని చెప్పుకొవచ్చు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ ఇవ్వడానికి రంగం సిద్దం చేస్తుంది.
ఈ ఆగస్టు 15 లోగా రైతు రుణమాఫీ పూర్తవుతుందని ఇప్పటికే పలు మార్లు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. 2019 ఏప్రిల్ 1 నుంచి 2023 డిసెంబరు 10వ తేదీ వరకు రైతులు తీసుకున్న పంట రుణాలకు ఈ మాఫీ వర్తిస్తుందని రేవంత్ వెల్లడించారు. ఎన్నికల కోడ్ ఉండడంతో తెలంగాణ రాష్ట్రంలో రుణమాఫీకి బ్రేక్ పడింది. ఇప్పుడు ఎన్నికల కోడ్ ముగియడంతో రుణమాఫీపై అధికారులు, సీఎం కసరత్తు చేస్తోన్నట్లు తెలుస్తోంది . ఈ నేపథ్యంలో రైతులు రుణమాఫీ ఎప్పుడెప్పుడు అవుతుందా అని ఆశతో ఎదురు చూస్తున్నారు.
అయితే జులై మొదటివారం నుండి ఆగస్టు 15 లోగా దశల వారిగా పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. మొదట లక్ష రుణమాఫీ,తర్వాత లక్షన్నర, చివరగా 2 లక్షల వరకు రుణమాఫీ చేయాలని అధికారులు భావిస్తున్నారు. దీంతో పేద రైతులకు లబ్ది చేకూరే అవకాశం ఉంటుంది .
• 5 ఎకరాల లోపు వ్యవసాయ భూమి ఉన్న రైతులకు మాత్రమే రుణమాఫీ వర్తిస్తుందని అధికారులు ముందుగానే పేర్కొన్నారు.
• ఆదాయపు పన్ను చెల్లించే వారిని పూర్తిగా పక్కనపెట్టే అవకాశం కూడా కనిపిస్తోంది.
• తెల్ల రేషన్ కార్డు ఉన్న రైతు కుటుంబాలకే ఈ రుణమాఫీ వర్తిస్తుందని, అది కూడా కుటుంబంలో ఒక్కరికే వస్తుందని చెబుతున్నారు.
సాధ్యమైనంత త్వరగా విధి విధానాలను ఖరారు చేసి రుణమాఫీ అమలు చేయాలని రేవంత్ ప్రభుత్వం భావిస్తోంది.