-
ప్రతి పంచాయతీ, తాండాలో ప్రభుత్వ పాఠశాల తప్పనిసరి
Thank you for reading this post, don't forget to subscribe! -
మూసివేసిన పాఠశాలలను తిరిగి ప్రారంభించాలని ఆదేశం
-
ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి మెగా DSC నిర్వహణ
-
మన ఊరు – మన బడి కార్యక్రమం పనుల పురోగతిపై సమీక్ష
-
పాఠశాలల్లో స్వీపర్లు, పారిశుధ్య కార్మికుల ఏర్పాటు సూచన
-
విద్యుత్ బిల్లుల వసూళ్లలో కేటగిరి మార్పు పరిశీలన
-
ప్రతి ఉమ్మడి జిల్లాకి ఒక స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు
పాఠశాలలు మూసివేయరాదు: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్: రాష్ట్రంలో ఎంత చిన్న గ్రామమైనా, మారుమూల తాండా అయినా తప్పనిసరిగా ఒక ప్రభుత్వ పాఠశాల ఉండాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశించారు. శనివారం సచివాలయంలో విద్యాశాఖ సమీక్ష సమావేశంలో సీఎం మాట్లాడుతూ “ఎంతమంది విద్యార్థులున్నా ప్రభుత్వ పాఠశాలను నడపాలి. విద్యార్థులు లేరనే నెపంతో పాఠశాల మూసివేయడం సరికాదు” అని స్పష్టం చేశారు.
ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి DSC
రాష్ట్రంలోని ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయడానికి త్వరలోనే మెగా DSC నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఉపాధ్యాయుల ప్రమోషన్లు, బదిలీల సమస్యలను త్వరగా పరిష్కరించాలని సూచించారు.
మన ఊరు – మన బడి కార్యక్రమం
మన ఊరు – మన బడి కార్యక్రమంలో జరుగుతున్న పనుల పురోగతిని సీఎం సమీక్షించారు. ఇంకా మిగిలిన పనులను త్వరగా పూర్తి చేసి ప్రభుత్వ పాఠశాలలను ఆధునిక పాఠశాలలుగా తీర్చిదిద్దాలని అన్నారు.
పాఠశాలల నిర్వహణపై సూచనలు
పాఠశాలల్లో స్వీపర్లు, పారిశుధ్య కార్మికులను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యుత్ బిల్లుల వసూళ్లలో వ్యాపార/పారిశ్రామిక కేటగిరీ కింద కాకుండా విద్యా కేటగిరీ కింద బిల్లులు వసూలు చేసేలా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని అధికారులను ఆదేశించారు.
స్కిల్ యూనివర్సిటీలు
ఉన్నత విద్యా రంగంలో భాగంగా రాష్ట్రంలోని పది ఉమ్మడి జిల్లాల్లో ఒక్కో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయనున్నట్లు సీఎం ప్రకటించారు.