వరి సాగు తెలంగాణ రైతుల జీవనాధారం. అయితే గత కొన్నేళ్లుగా కూలీల కొరత మరియు వరి నాటు ఖర్చులు పెరగడం వల్ల రైతులు కొత్త పద్ధతులను అనుసరించడం ప్రారంభించారు.
సాధారణంగా వరి సాగు చేయాలంటే ముందు నారు పోసి 30 రోజులు తర్వాత నాటు వేయాలి. ఈ విధానం కాస్త శ్రమతో కూడుకున్నది మరియు ఖర్చుతో కూడి ఉంటుంది.
సాంప్రదాయ పద్ధతిలో ఖర్చు
-
నాటు కోసం ఒక ఎకరాకు 25 కేజీల విత్తనాలు అవసరం.
Thank you for reading this post, don't forget to subscribe! -
12 నుంచి 14 మంది నాటు కూలీలు అవసరం అవుతారు.
-
కూలీలకు మాత్రమే ₹6,000 – ₹8,000 ఖర్చు అవుతుంది.
-
మొత్తంగా నాటు వరకూ ఖర్చు ₹20,000 వరకు పెరుగుతుంది.
-
దిగుబడి: ఎకరాకు 20–30 క్వింటాళ్లు.
వెదజల్లే పద్ధతి – తక్కువ ఖర్చు, ఎక్కువ ఫలితం
ఇక ప్రస్తుతం రైతులు అనుసరిస్తున్న కొత్త పద్ధతి — వడ్లను వెదజల్లే పద్ధతి (Broadcasting Method).
ఈ విధానం ద్వారా కూలీలపై ఆధారపడాల్సిన అవసరం తగ్గిపోతుంది.
-
ఒక ఎకరాకు 12 కేజీల విత్తనాలు చాలు.
-
కూలీల అవసరం చాలా తక్కువ.
-
వడ్లు వెదజల్లిన తరువాత పొలం మడిలోని నీరు తీసివేయాలి, తద్వారా మొక్కలు గాలిలో బలపడతాయి.
-
ఎకరాకు 25 నుండి 30 క్వింటాళ్లు దిగుబడి వస్తుంది.
పూర్వకాల పద్ధతుల పునరాగమనం
పాత తరాల రైతులు ఇదే పద్ధతిని అనుసరించేవారు.
ఇప్పుడు టెక్నాలజీ ఆధారంగా విత్తనాలు వెదజల్లడం మరింత సులభమైంది.
కూలీల కొరత ఉన్న ప్రస్తుత కాలంలో ఈ పద్ధతి రైతులకు ఆర్థిక భారం తగ్గించే మార్గంగా మారుతోంది.
వరి సాగు విధానంలో జరుగుతున్న ఈ మార్పులు తక్కువ పెట్టుబడి – అధిక దిగుబడి సాధనకు మార్గం చూపుతున్నాయి.
ప్రభుత్వం ఈ పద్ధతిని ప్రోత్సహించి, రైతులకు అవసరమైన సాంకేతిక మద్దతు ఇస్తే, తెలంగాణ వ్యవసాయం మరింత ఆర్థికంగా బలపడే అవకాశం ఉంది.
✍️ By Veeramusti Sathish
Independent Digital Journalist & Founder – Prathipaksham TV