హైదరాబాద్: తెలంగాణ పోలీస్ శాఖలో అవినీతి ఆరోపణలపై సర్కార్ సీరియస్ గా స్పందిస్తోంది . ఇప్పటికే హైదరాబాద్ నగర శివార్లల్లో మూకుమ్మడి బదిలీలకు రంగం సిద్ధం చేసింది.దీనిలో భాగంగా అవినీతి ఆరోపణలపై విచారణకు స్పెషల్ బ్రాంచ్ ఇంటెలిజెన్స్ పోలీసులను ప్రభుత్వం రంగంలోకి దింపింది.
భూ వివాదాలల్లో జోక్యం చేసుకుంటున్న పోలీస్ అధికారుల సమాచారాన్ని ఇంటిలిజెన్స్ ద్వారా సేకరిస్తోంది.ఇప్పటికే ఉన్నతాధికారులు అవినీతి అధికారుల చిట్టా రాబట్టే పనిలో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించిన అధికారులపైన కూడా ఎఫెక్ట్ ఉండబోతుంది. ఇప్పటికే 52 మంది ఇన్స్పెక్టర్లు బదిలీ అయ్యారు. త్వరలోనే బడా పోలీస్ అధికారులు కూడా బదిలీ అయ్యే అవకాశం ఉంది. మరికొద్ది రోజుల్లో భారీగా కీలక అధికారుల బదిలీలు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
రాష్ర్టంలో ఎలాంటి పైరవీలు కుదరవనీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.దీంతో పోలీస్ శాఖలో ఇకపై పోస్టింగ్‌ల విషయంలో రాజకీయ నాయకుల రికమెండేషన్స్, ఎమ్మెల్యే లెటర్స్ పని చేయవని, ప్రతిభావంతులకే పోస్టింగ్‌లు ఇస్తామని ఇటీవల సీపీలు ప్రకటించారు.