బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడి కేసు విషయంలో పంజాగుట్ట సీఐ సస్పెండ్ తో పాటు పీఎస్ సిబ్బంది మొత్తాన్ని బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ అయిన విషయం మరువక ముందే.. ఇప్పుడు మరో సీఐపై సస్పెన్షన్ వేటు పడింది.
ఏం జరిగిందంటే..
భర్త వేధిస్తున్నాడంటూ ఓ మహిళ ఫిర్యాదు చేసేందుకు మియార్పూర్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చింది. అయితే ఈ బాధిత మహిళ పట్ల మియాపూర్ సీఐ ప్రేమ్ కుమార్ అసభ్యకరంగా ప్రవర్తించాడు.ఈ విషయంపై సదరు మహిళ సైబరాబాద్ పోలీస్ లకు ఫిర్యాదు చేసింది. దీంతో మహిళ ఫిర్యాదుపై ఉన్నతాధికారులు విచారణ చేయగా సీఐ ప్రేమ్ కుమార్ రాసలీలల బాగోతం అంతా బయటపడింది. లోతుగా విచారణ చేపట్టిన సీపీ అవినాష్ మహంతి ఇన్స్పెక్టర్ ప్రేమ్ కుమార్‌ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.