ప్రజా పాలనలో కోట్ల దరఖాస్తులు
తెలంగాణ ప్రభుత్వం ఐదు గ్యారెంటీ హామీల అమలులో భాగంగా ప్రజా పాలన కార్యక్రమాన్ని డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. ఈ కాలంలో కోట్లల్లో దరఖాస్తులు స్వీకరించబడ్డాయి.
Thank you for reading this post, don't forget to subscribe!దరఖాస్తులను కంప్యూటరీకరించడానికి ప్రత్యేక వెబ్సైట్ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రస్తుతం ఈ డేటా ఎంట్రీ కార్యక్రమం పూర్తి దశలో ఉందని అధికారులు చెబుతున్నారు.
Application Status చెక్ ఆప్షన్
దరఖాస్తుదారులు తమ దరఖాస్తుల స్థితిని తెలుసుకోవడానికి ‘KNOW YOUR APPLICATION STATUS’ అనే ఆప్షన్ను పోర్టల్లో ఏర్పాటు చేశారు.
-
దరఖాస్తుదారులు Application Number ఎంటర్ చేయాలి
-
తరువాత Captcha పూర్తి చేయాలి
-
ఆ తర్వాత View Status క్లిక్ చేస్తే వివరాలు చూపించాలి
Captcha సమస్యతో ఇబ్బందులు
అయితే, దరఖాస్తుదారులు గత రెండు మూడు రోజులుగా captcha ఆప్షన్ పనిచేయకపోవడం వల్ల స్టేటస్ తెలుసుకోవడంలో సమస్యలు ఎదుర్కొంటున్నారు. Application Number ఆప్షన్ పనిచేస్తున్నా, Captcha లొపం కారణంగా View Status పేజీ ఓపెన్ కావడం లేదు.
లబ్ధిదారుల ఆందోళన
ప్రస్తుతం ఈ డేటా ఎంట్రీ ఎప్పుడు పూర్తవుతుందో, లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడు జరుగుతుందో అనే విషయంపై ప్రజలు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కోట్లాది మంది ఈ ఐదు గ్యారెంటీ పథకాల ప్రయోజనాల కోసం ఆశలు పెట్టుకున్నారు.
https://prajapalana.telangana.gov.in/Applicationstatus