TC డ్రైవర్లు, శ్రామిక్ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి (TSLPRB) 2025 సెప్టెంబర్ 17న RTC డ్రైవర్లు మరియు శ్రామిక్ (టెక్నికల్ వర్కర్లు) నియామకానికి సంబంధించి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు అక్టోబర్ 8 ఉదయం 8 గంటల నుండి అక్టోబర్ 28 సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలి.
మొత్తం ఖాళీలు:
-
డ్రైవర్లు – 1,000 పోస్టులు
Thank you for reading this post, don't forget to subscribe! -
శ్రామికులు – 743 పోస్టులు
మొత్తం ఖాళీలు: 1,743
డ్రైవర్ పోస్టులు (Post Code – 45)
-
వేతనం: ₹20,960 – ₹60,080
-
వయసు పరిమితి: కనీసం 22 ఏళ్లు – గరిష్ఠం 35 ఏళ్లు (ప్రభుత్వం ఇచ్చిన 12 ఏళ్ల రాయితీతో వయస్సులో సడలింపు వర్తిస్తుంది).
-
అర్హత:
-
SSC లేదా దానికి సమానమైన పరీక్ష ఉత్తీర్ణత.
-
Heavy Passenger Motor Vehicle (HPMV), Heavy Goods Vehicle (HGV) లైసెన్స్ తప్పనిసరి. కనీసం 18 నెలల అనుభవం ఉండాలి.
-
శారీరక ప్రమాణాలు (కనీస ఎత్తు – 160 సెంటీమీటర్లు).
-
కంటి చూపు, ఆరోగ్య ప్రమాణాలు కచ్చితంగా ఉండాలి.
-
-
ఎంపిక విధానం:
-
Physical Measurement Test.
-
డ్రైవింగ్ టెస్ట్ (60 మార్కులు).
-
SSC మార్కులు + డ్రైవింగ్ అనుభవానికి వెయిటేజీ (40 మార్కులు).
-
మొత్తం 100 మార్కులు ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
-
శ్రామిక్ పోస్టులు (Post Code – 46)
-
వేతనం: ₹16,550 – ₹45,030
-
వయసు పరిమితి: కనీసం 18 ఏళ్లు – గరిష్ఠం 30 ఏళ్లు (ప్రభుత్వం ఇచ్చిన 12 ఏళ్ల వయస్సు రాయితీ వర్తిస్తుంది).
-
అర్హత:
-
సంబంధిత ట్రేడ్లో ITI ఉత్తీర్ణత (Mechanic Diesel, Motor Vehicle, Sheet Metal, Fitter, Auto Electrician, Painter, Welder, Upholster, Millwright Mechanic మొదలైనవి).
-
ఆరోగ్య, కంటి చూపు ప్రమాణాలు తప్పనిసరి.
-
-
ఎంపిక విధానం:
-
ITI మార్కులకు వెయిటేజీ (90 మార్కులు).
-
National Apprenticeship Certificate (NAC) ఉంటే అదనంగా 10 మార్కులు.
-
మొత్తం 100 మార్కులు ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
-
రిజర్వేషన్లు:
-
BC, SC, ST, EWS అభ్యర్థులకు రిజర్వేషన్ నిబంధనలు వర్తిస్తాయి.
-
మహిళలకు 33⅓% హరిజాంటల్ రిజర్వేషన్ డ్రైవర్ పోస్టుల్లో వర్తిస్తుంది.
-
శ్రామిక్ పోస్టుల్లో మహిళలకు వేరు రిజర్వేషన్ లేదు.
-
లోకల్ అభ్యర్థులకు (జిల్లా వారీగా) 95% పోస్టులు కేటాయింపు, మిగిలిన 5% రాష్ట్రవ్యాప్తంగా మెరిట్ ఆధారంగా భర్తీ.
ఫీజు వివరాలు:
-
డ్రైవర్లు – SC/ST స్థానికులకు ₹300, ఇతరులకు ₹600
-
శ్రామికులు – SC/ST స్థానికులకు ₹200, ఇతరులకు ₹400
దరఖాస్తు విధానం:
-
వెబ్సైట్: www.tgprb.in
-
మొబైల్ నంబర్ ద్వారా రిజిస్ట్రేషన్ తప్పనిసరి.
-
ఫీజు చెల్లింపు తర్వాత మాత్రమే అప్లికేషన్ పూర్తి అవుతుంది.
-
ఫోటో + సంతకం ఒకే JPG ఫైల్లో అప్లోడ్ చేయాలి.
-
ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత మార్పులు చేయడం సాధ్యం కాదు.
ముఖ్యమైన తేదీలు:
-
ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం – అక్టోబర్ 8, 2025
-
ఆన్లైన్ దరఖాస్తుల ముగింపు – అక్టోబర్ 28, 2025
తెలంగాణ ప్రభుత్వం RTCలో డ్రైవర్లు, టెక్నికల్ శ్రామిక్ ఉద్యోగాలకు 1,743 ఖాళీలు ప్రకటించడం నిరుద్యోగ యువతకు పెద్ద అవకాశంగా భావిస్తున్నారు. అభ్యర్థులు తమ అర్హతలు, వయసు పరిమితులు జాగ్రత్తగా పరిశీలించి దరఖాస్తు చేసుకోవాలి.