ఆర్టీఐ చట్టం – ప్రజల వజ్రాయుధం
సమాచార హక్కు చట్టం (Right to Information Act – 2005) పౌరులకు ప్రభుత్వ యంత్రాంగం నుండి సమాచారం పొందే హక్కును ఇస్తుంది. 30 రోజుల్లోపు, అత్యవసర పరిస్థితుల్లో 48 గంటల్లోపు సమాచారం ఇవ్వాలని ఈ చట్టం చెబుతోంది.
Thank you for reading this post, don't forget to subscribe!తెలంగాణలో కమీషనర్లు లేక ఇబ్బందులు
తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీఐ కమీషనర్లు 2023 ఫిబ్రవరిలో రిటైర్ అయ్యారు. అప్పటి నుండి కొత్త నియామకాలు జరగకపోవడంతో రాష్ట్రంలో దరఖాస్తులు వేల సంఖ్యలో పెండింగ్లో ఉన్నాయి.
ఉదాహరణ – భూపాలపల్లి జిల్లా
జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల పోలీస్ స్టేషన్కు ఒక పౌరుడు ఆర్టీఐ దరఖాస్తు చేసుకున్నారు. 30 రోజుల్లో సమాచారం ఇవ్వాల్సింది. కానీ నాలుగు నెలలు గడిచినా పిఐఓ, డిఎస్పి ఆఫీస్ నుండి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. ఫస్ట్ అప్పీల్ చేసినా కూడా ఫలితం లేకుండా పోయింది.
అధికారుల నిర్లక్ష్యం – ప్రజల నిరాశ
ఈ పరిస్థితి సామాన్య పౌరులకు మాత్రమే కాకుండా, గతంలో ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి కూడా ఆర్టీఐ వాడినప్పుడు ఎదుర్కొన్న సమస్యలతో సమానమని ఆర్టీఐ కార్యకర్తలు చెబుతున్నారు. కొందరు అధికారుల నిర్లక్ష్యం, బాధ్యత రాహిత్యంపై జరిమానాలు విధించిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేస్తున్నారు.
సమాచార కమీషన్ స్పందన
ప్రతిపక్షం TV సంప్రదించగా తెలంగాణ రాష్ట్ర సమాచార కమీషన్ ఉద్యోగులు తెలిపారు: “కమీషనర్లు రిటైర్ అయిన తర్వాత వచ్చిన దరఖాస్తులు అన్ని పెండింగ్లోనే ఉన్నాయి. కొత్త కమీషనర్లు నియమించాకే వాటిని పరిష్కరిస్తారు” అని చెప్పారు.
ఆర్టీఐ కార్యకర్తల డిమాండ్
ప్రజాస్వామ్యవాదులు, ఆర్టీఐ కార్యకర్తలు రాష్ట్ర ప్రభుత్వాన్ని తక్షణమే కమీషనర్లను నియమించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే RTI చట్టం ప్రభావం తగ్గిపోతుందని హెచ్చరిస్తున్నారు.