మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు విష్ణు మంచు సోమవారం తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను మర్యాద పూర్వకంగా కలిశారు. శాలువాతో సత్కరించి చిత్ర పరిశ్రమ తరుపున బహుమతిని అందజేశారు. ఇక ఈ భేటీలో అనేక విషయాల మీద ఇరువురు చర్చించారు. ఈ భేటీ గురించి మా అధ్యక్షుడు విష్ణు మంచు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
‘తెలంగాణ ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారిని కలుసుకోవడం ఆనందంగా ఉంది. ఎన్నో విషయాల మీద చర్చించాం. తెలుగు చిత్ర పరిశ్రమ తరుపున డ్రగ్స్ వ్యతిరేక ప్రచార కార్యక్రమాల గురించి మాట్లాడాం. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో, డ్రగ్స్ ఫ్రీ సొసైటి కోసం ప్రయత్నిస్తున్న ఇలాంటి ప్రభుత్వంతో మేమంతా ఐకమత్యంగా కలిసి పని చేయడానికి సిద్దంగా ఉన్నామని విష్ణు మంచు తెలిపారు.
Previous ArticleTelangana police: రాసలీలల సీఐ సస్పెండ్
Next Article Cinema:క్రైమ్ థ్రిల్లర్ మూవీ డ్రిల్
Veeramusti Sathish, MAJMC
Independent journalist, RTI activist & founder of PrathipakshamTV.com, specializing in legal and investigative reporting.