మైత్రీ మూవీ మేకర్స్, ఫణీంద్ర నర్సెట్టి సినిమా ఆసక్తికరమైన టైటిల్ ‘8 వసంతాలు’
మోస్ట్ సక్సెస్ ఫుల్ పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ హై బడ్జెట్లో స్టార్ హీరోల సినిమాలను నిర్మించడంతో పాటు, ఆసక్తికరమైన వినూత్నమైన కాన్సెప్ట్‌లతో కూడిన చిత్రాలనీ రూపొందిస్తున్నారు. వాలంటైన్స్ డే సందర్భంగా ఫణీంద్ర నర్సెట్టితో కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశారు.
అవార్డ్ విన్నింగ్ బ్లాక్ బస్టర్ షార్ట్ ఫిల్మ్ మధురం తీసి, విమర్శకుల ప్రశంసలు అందుకుని, ‘మను’ సినిమాతో తన ఫీచర్ ఫిల్మ్ దర్శకుడిగా అరంగేట్రం చేసిన ఫణీంద్ర నర్సెట్టి ‘8 వసంతాలు’ అనే మరో ఆసక్తికరమైన చిత్రంతో రాబోతున్నాడు.
8 వసంతాలు అంటే ‘8 స్ప్రింగ్స్’, ఈ న్యూ ఏజ్ రోమాన్స్ డ్రామా, ఇది 8 సంవత్సరాల కాలంలో కాలక్రమానుసారంగా సాగే కథనం, ఒక అందమైన యువతి జీవితంలోని ఒడిదుడుకులు, ఆసక్తికరమైన ప్రయాణాన్ని ఎక్స్ ఫ్లోర్ చేయనుంది.
టైటిల్, టైటిల్ పోస్టర్‌తో దర్శకుడు తన వినూత్న కోణాన్ని చూపించాడు. “365 రోజులని అంకెలతో కొలిస్తే ఒక సంవత్సరం… అదే అనుభవాలతో కొలిస్తే, ఒక వసంతం” అని పోస్టర్లో ఉంది. టైటిల్ పోస్టర్లో వర్షంలో తడుస్తున్న గులాబీ కనిపిస్తుంది.
నవీన్ యెర్నేని, వై రవి శంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్, పోస్టర్ ఆసక్తిని రేకెత్తించాయి. ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను తర్వాత వెల్లడించనున్నారు మేకర్స్.
సాంకేతిక విభాగం
రచన, దర్శకత్వం: ఫణీంద్ర నర్సెట్టి
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో
Previous Articleబ్యూటిఫుల్ లవ్‌స్టోరి ‘ఉషా పరిణయం’ ఫస్ట్ లుక్ విడుదల
Veeramusti Sathish, MAJMC
Independent journalist, RTI activist & founder of PrathipakshamTV.com, specializing in legal and investigative reporting.