హైదరాబాద్: తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (TGCHE) తాజాగా TG LAWCET-2025 అడ్మిషన్ల రెండో & ఫైనల్ ఫేజ్ వెబ్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. లా విద్యను అభ్యసించాలనుకునే అభ్యర్థులకు ఇది చివరి అవకాశం.
TG LAWCET ముఖ్య షెడ్యూల్
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ & సర్టిఫికేట్ అప్లోడ్: సెప్టెంబర్ 11 నుంచి 13, 2025
వెరిఫైడ్ లిస్ట్ విడుదల: సెప్టెంబర్ 14, 2025
వెబ్ ఆప్షన్స్ (Phase-II): సెప్టెంబర్ 15 & 16, 2025
వెబ్ ఆప్షన్స్ ఎడిట్: సెప్టెంబర్ 17, 2025
సీటు అలాట్మెంట్ (కాలేజీ వారీగా): సెప్టెంబర్ 22, 2025
కాలేజీల్లో రిపోర్టింగ్ & ఫీజు చెల్లింపు: సెప్టెంబర్ 23 నుంచి 27, 2025
ఎవరు పాల్గొనాలి?
ఫస్ట్ ఫేజ్‌లో సీటు వచ్చినా, మరో కాలేజీకి మారాలనుకునే వారు
ఫస్ట్ ఫేజ్‌లో పాల్గొన్నా సీటు రాకపోయిన వారు
ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్‌కి రాని వారు
సీటు వచ్చినా రిపోర్ట్ చేయని వారు
ఫస్ట్ ఫేజ్‌లో సీటు పొంది, తర్వాత రద్దు చేసుకున్న వారు
TG LAWCET అర్హతలు
3 ఏళ్ల LLB: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్ (10+2+3 ప్యాటర్న్) కనీసం 45% (OC/BC), 42% (OBC), 40% (SC/ST) మార్కులు ఉండాలి.
5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ LLB: ఇంటర్ (10+2 ప్యాటర్న్) కనీసం 45% (OC/BC), 42% (OBC), 40% (SC/ST) మార్కులు ఉండాలి.
ఓపెన్ యూనివర్సిటీ ద్వారా ప్రాథమిక అర్హత (SSC లేకుండా) డైరెక్ట్‌గా పొందిన డిగ్రీ/ఇంటర్ అర్హతలు పరిగణించబడవు.
సమర్పించవలసిన సర్టిఫికేట్లు
TG LAWCET-2025 ర్యాంక్ కార్డు, హాల్ టికెట్
SSC, ఇంటర్, డిగ్రీ మార్క్ మెమోలు
ప్రొవిజినల్ / డిగ్రీ సర్టిఫికెట్
స్టడీ & రెసిడెన్స్ సర్టిఫికేట్లు (10 సంవత్సరాలు)
కుల, ఆదాయ, EWS, మైనారిటీ సర్టిఫికేట్లు (అవసరమైతే)
ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, ఆధార్
ఇతర అవసరమైన ధృవపత్రాలు (PH, CAP, NCC, స్పోర్ట్స్ కేటగిరీ ఉంటే)
ఫీజు వివరాలు
ప్రాసెసింగ్ ఫీజు: ₹800 (OC/BC), ₹500 (SC/ST) – ఆన్లైన్ చెల్లింపు తప్పనిసరి.
ట్యూషన్ ఫీజు & స్పెషల్ ఫీజు: ప్రభుత్వం నిర్ణయించిన రీతిలో చెల్లించాలి.
హరిత నిధి (Green Fund): ప్రతి విద్యార్థి నుంచి అదనంగా ₹100 వసూలు చేస్తారు.
ఫీజు రీయింబర్స్మెంట్ – ప్రభుత్వం జారీ చేసే మార్గదర్శకాలకు అనుగుణంగా వర్తిస్తుంది.
TG LAWCET రిజర్వేషన్లు:
85% సీట్లు స్థానిక (OU ప్రాంతం) అభ్యర్థులకు, 15% సీట్లు అన్‌రిజర్వ్‌డ్‌గా ఉంటాయి.
EWS కేటగిరీకి 10% రిజర్వేషన్ ఉంటుంది.
SC, ST, BC, PH, NCC, CAP, స్పోర్ట్స్ కేటగిరీలకు ప్రత్యేక రిజర్వేషన్లు అమలులో ఉంటాయి.
TG LAWCET ముఖ్య సూచనలు:
రెండో దశలో పొందిన సీటు తర్వాత పాత సీటుపై హక్కు ఉండదు.
కౌన్సెలింగ్‌లో పాల్గొనడం మాత్రమే సీటు హామీ కాదు.
వెబ్ ఆప్షన్స్ డెస్క్‌టాప్/ల్యాప్‌టాప్ ద్వారా మాత్రమే ఇవ్వాలి.
కాలేజీలో ఒరిజినల్ సర్టిఫికేట్లు చూపించి, ఫీజు చెల్లించిన తర్వాతే అడ్మిషన్ ఫైనల్‌గా పరిగణించబడుతుంది.

