హైదరాబాద్: TG LAWCET 2025 స్పాట్ అడ్మిషన్లు ప్రారంభం ..తెలంగాణ ఉన్నత విద్యా మండలి (TGCHE) TG LAWCET-2025 స్పాట్ అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రైవేట్ లా కళాశాలల్లో మిగిలిన/ఖాళీగా ఉన్న/రద్దు అయిన సీట్లను ఇన్స్టిట్యూషనల్ స్పాట్ అడ్మిషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. 3 ఏళ్ల LL.B మరియు 5 ఏళ్ల LL.B కోర్సుల్లో చేరాలనుకునే అభ్యర్థులు సంబంధిత లా కాలేజీలను నేరుగా సంప్రదించి ప్రవేశం పొందవచ్చు. లా కళాశాలల జాబితా, ఖాళీ సీట్లు, రిజిస్ట్రేషన్ లింకులు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి:
🔗 https://lawcetadm.tgche.ac.in
ముఖ్య సూచనలు:
అసలు సర్టిఫికేట్లు లేకుండా అడ్మిషన్ లేదు
Thank you for reading this post, don't forget to subscribe!అసలు సర్టిఫికేట్లతో కళాశాలకు హాజరు కావాలి
రెండు సెట్లు జిరాక్స్‌లు + TC తప్పనిసరి
ఫీ రీయింబర్స్మెంట్ వర్తించదు (స్పాట్ అడ్మిషన్‌కి మాత్రమే)
అడ్మిషన్లు LAWCET-2025 ర్యాంక్ ఆధారంగా మాత్రమే
స్పాట్ అడ్మిషన్ ప్రాసెస్:
ప్రతి కాలేజీ ఇచ్చిన స్పాట్ నోటిఫికేషన్‌కి స్పందించాలి
ఆన్‌లైన్‌గా రిజిస్ట్రేషన్ పూర్తి చేసి ఫారం ప్రింట్ తీసుకోవాలి
గడువు తేదీలోపు కాలేజీకి వెళ్లాలి
సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనంతరం అక్నాలెడ్జ్ స్లిప్ తీసుకోవాలి
మెరిట్ ప్రకారం అడ్మిషన్ లభిస్తుంది
సీటు కన్ఫర్మ్ అయిన వెంటనే ట్యూషన్ ఫీజు చెల్లించాలి
ఇప్పటికే మరే కాలేజీలో అడ్మిషన్ తీసుకున్న వారు పాత అడ్మిషన్ రద్దు చేసి మాత్రమే కొత్త సీటు పొందగలరు
స్పాట్ అడ్మిషన్ షెడ్యూల్ (కాలేజీ వారీగా):
గ్రూప్ | కాలేజీలు | దరఖాస్తుల చివరి తేదీ | సీట్ల కేటాయింపు | రిపోర్టింగ్ |
|---|---|---|---|---|
I గ్రూప్ | పెండెకంటి లా కాలేజీ, కె.వి.రంగారెడ్డి లా కాలేజీ, పడాల రామ్ రెడ్డి లా కాలేజీ, మహాత్మా గాంధీ లా కాలేజీ | అక్టోబర్ 15, 12 గం.లోపు | అక్టోబర్ 15 సా. 4 గం. | అక్టోబర్ 16, 12 గం.లోపు |
II గ్రూప్ | మార్వాడీ శిక్షా సమితి లా, పోనుగంటి మాధవరావు లా, అంబేడ్కర్ లా, ఆంధ్రా మహిలా సభ లా, డా. వీ.ఆర్.కే లా | అక్టోబర్ 16, 12 గం.లోపు | అక్టోబర్ 16 సా. 4 గం. | అక్టోబర్ 17, 12 గం.లోపు |
III గ్రూప్ | సుల్తాన్-ఉల్-ఉలూమ్ లా, కేశవ మెమోరియల్ లా, అరోరా లా అకాడమీ, అనంత లా కాలేజీ | అక్టోబర్ 17 | అక్టోబర్ 17 | అక్టోబర్ 18 |
IV గ్రూప్ | భాస్కర్ లా, విశ్వభారతీ లా, వినాయక లా, ఇస్లామియా లా | అక్టోబర్ 22 | అక్టోబర్ 22 | అక్టోబర్ 23 |
V గ్రూప్ | ఆదర్శ లా, కిమ్స్ లా, మనెర్ లా, ,అరోరా లా ఇనిస్టిట్యూట్, SDM లా | అక్టోబర్ 23 | అక్టోబర్ 23 | అక్టోబర్ 24 |
అర్హతలు:
🎓 3 Year LL.B
డిగ్రీ (10+2+3) ఉత్తీర్ణత తప్పనిసరి
మార్కులు: OC/BC – 45%, OBC – 42%, SC/ST – 40%
🎓 5 Year LL.B
ఇంటర్ (+2) ఉత్తీర్ణత
మార్కులు: OC/BC – 45%, OBC – 42%, SC/ST – 40%
గమనిక: ఓపెన్ యూనివర్సిటీ/సింగిల్ సిట్టింగ్ డిగ్రీ విద్యార్థులు అర్హులు కాదు.
అవసరమైన సర్టిఫికేట్లు:
LAWCET-2025 ర్యాంక్ కార్డ్
SSC మెమో
ఇంటర్/డిగ్రీ మెమోలు
స్టడీ సర్టిఫికేట్లు
ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ (TC)
కుల, ఆదాయ ధ్రువపత్రాలు
రిజిస్ట్రేషన్ ఫీజు:
| క్యాటగరీ | ఫీజు |
|---|---|
| OC/BC | ₹800 |
| SC/ST | ₹500 |
