టిజిఎన్పీడీసీఎల్ (TGNPDCL) కంపెనీ మరో కొత్త సర్వీస్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పటికే సంస్థ 24 గంటలు అందుబాటులో ఉండే 1912 టోల్‌ఫ్రీ నంబర్ ద్వారా విద్యుత్ సంబంధిత ఫిర్యాదులు స్వీకరిస్తున్న విషయం అందరికీ తెలిసిందే.అయినప్పటి ఆ డిపార్ట్మెంట్ లో అవినీతి ఆరోపణలు పెద్ద ఎత్తున రావడం ఈ నేపథ్యంలో ఇప్పుడు రైతులకు మరింత పారదర్శకమైన సేవలను అందించడానికి, సంస్థ ఒక కొత్త డిజిటల్ సౌకర్యాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా ఎస్టిమేట్‌కు సంబంధించిన మెటీరియల్స్, స్కెచ్ (నక్ష) వంటి వివరాలు ఇప్పుడు తెలుగు భాషలో అందుబాటులో ఉంటాయి.
Thank you for reading this post, don't forget to subscribe!రైతులు తమ మొబైల్ ఫోన్ నంబర్ కి వచ్చే SMS లోని లింక్‌పై క్లిక్ చేస్తే, వారికి సంబంధించిన అన్ని వివరాలు స్పష్టంగా కనిపిస్తాయి. దీంతో వారి కనెక్షన్ కు సంబంధించి ఏ మెటీరియల్ ఉపయోగిస్తున్నారు, ఖర్చు ఎంత, ఎక్కడ వాడతారు వంటి సమాచారం రైతులకు నేరుగా అందుతుంది.
ఈ సేవతో విద్యుత్ ప్రాజెక్టుల్లో పారదర్శకత పెరగడంతో పాటు, గ్రామీణ ప్రాంత రైతులకు అవగాహన కూడా పెరుగుతుందని సంస్థ అధికారులు తెలిపారు.
రైతులు ఈ కొత్త సేవపై హర్షం వ్యక్తం చేస్తూ,
“ఇప్పటివరకు ఎస్టిమేట్ వివరాలు అర్థం కాక ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు మన భాషలో, స్పష్టంగా వివరాలు కనిపిస్తున్నాయి. ఇది రైతులకు చాలా ఉపయోగపడుతుంది,”
అని పలువురు తెలిపారు.
READ IN ENGLISH
TGNPDCL New Service for Farmers: Estimate Details Now in Telugu via SMS Link