TGSRTC డ్రైవర్లు, శ్రామిక్ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి (TSLPRB) 2025 సెప్టెంబర్ 17న TGSRTC డ్రైవర్లు మరియు శ్రామిక్ (టెక్నికల్ వర్కర్లు) నియామకానికి సంబంధించి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు అక్టోబర్ 8 ఉదయం 8 గంటల నుండి అక్టోబర్ 28 సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలి.
మొత్తం ఖాళీలు:
డ్రైవర్లు – 1,000 పోస్టులు
Thank you for reading this post, don't forget to subscribe!శ్రామికులు – 743 పోస్టులు
మొత్తం ఖాళీలు: 1,743
డ్రైవర్ పోస్టులు (Post Code – 45)
వేతనం: ₹20,960 – ₹60,080
వయసు పరిమితి: కనీసం 22 ఏళ్లు – గరిష్ఠం 35 ఏళ్లు (ప్రభుత్వం ఇచ్చిన 12 ఏళ్ల రాయితీతో వయస్సులో సడలింపు వర్తిస్తుంది).
అర్హత:
SSC లేదా దానికి సమానమైన పరీక్ష ఉత్తీర్ణత.
Heavy Passenger Motor Vehicle (HPMV), Heavy Goods Vehicle (HGV) లైసెన్స్ తప్పనిసరి. కనీసం 18 నెలల అనుభవం ఉండాలి.
శారీరక ప్రమాణాలు (కనీస ఎత్తు – 160 సెంటీమీటర్లు).
కంటి చూపు, ఆరోగ్య ప్రమాణాలు కచ్చితంగా ఉండాలి.
ఎంపిక విధానం:
Physical Measurement Test.
డ్రైవింగ్ టెస్ట్ (60 మార్కులు).
SSC మార్కులు + డ్రైవింగ్ అనుభవానికి వెయిటేజీ (40 మార్కులు).
మొత్తం 100 మార్కులు ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
శ్రామిక్ పోస్టులు (Post Code – 46)
వేతనం: ₹16,550 – ₹45,030
వయసు పరిమితి: కనీసం 18 ఏళ్లు – గరిష్ఠం 30 ఏళ్లు (ప్రభుత్వం ఇచ్చిన 12 ఏళ్ల వయస్సు రాయితీ వర్తిస్తుంది).
అర్హత:
సంబంధిత ట్రేడ్లో ITI ఉత్తీర్ణత (Mechanic Diesel, Motor Vehicle, Sheet Metal, Fitter, Auto Electrician, Painter, Welder, Upholster, Millwright Mechanic మొదలైనవి).
ఆరోగ్య, కంటి చూపు ప్రమాణాలు తప్పనిసరి.
ఎంపిక విధానం:
ITI మార్కులకు వెయిటేజీ (90 మార్కులు).
National Apprenticeship Certificate (NAC) ఉంటే అదనంగా 10 మార్కులు.
మొత్తం 100 మార్కులు ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
రిజర్వేషన్లు:
BC, SC, ST, EWS అభ్యర్థులకు రిజర్వేషన్ నిబంధనలు వర్తిస్తాయి.
మహిళలకు 33⅓% హరిజాంటల్ రిజర్వేషన్ డ్రైవర్ పోస్టుల్లో వర్తిస్తుంది.
శ్రామిక్ పోస్టుల్లో మహిళలకు వేరు రిజర్వేషన్ లేదు.
లోకల్ అభ్యర్థులకు (జిల్లా వారీగా) 95% పోస్టులు కేటాయింపు, మిగిలిన 5% రాష్ట్రవ్యాప్తంగా మెరిట్ ఆధారంగా భర్తీ.
ఫీజు వివరాలు:
డ్రైవర్లు – SC/ST స్థానికులకు ₹300, ఇతరులకు ₹600
శ్రామికులు – SC/ST స్థానికులకు ₹200, ఇతరులకు ₹400
దరఖాస్తు విధానం:
వెబ్సైట్: www.tgprb.in
మొబైల్ నంబర్ ద్వారా రిజిస్ట్రేషన్ తప్పనిసరి.
ఫీజు చెల్లింపు తర్వాత మాత్రమే అప్లికేషన్ పూర్తి అవుతుంది.
ఫోటో + సంతకం ఒకే JPG ఫైల్లో అప్లోడ్ చేయాలి.
ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత మార్పులు చేయడం సాధ్యం కాదు.
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం – అక్టోబర్ 8, 2025
ఆన్లైన్ దరఖాస్తుల ముగింపు – అక్టోబర్ 28, 2025
తెలంగాణ ప్రభుత్వం RTCలో డ్రైవర్లు, టెక్నికల్ శ్రామిక్ ఉద్యోగాలకు 1,743 ఖాళీలు ప్రకటించడం నిరుద్యోగ యువతకు పెద్ద అవకాశంగా భావిస్తున్నారు. అభ్యర్థులు తమ అర్హతలు, వయసు పరిమితులు జాగ్రత్తగా పరిశీలించి దరఖాస్తు చేసుకోవాలి.
-BY VEERAMUSTI SATHISH,MAJMC
READ MORE:

