TSPSC Groups Exam Dates 2024 :
టీఎస్పీఎస్పీ (TSPSC) నుంచి లేటెస్ట్ అప్డేట్ వచ్చేసింది. గ్రూప్ 1 మెయిన్స్ తో పాటు గ్రూప్ 2, 3 పరీక్షల తేదీలను ఖరారు చేసింది.
అక్టోబర్ 21 నుంచి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు
ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు
నవంబర్ 17, 18 తేదీల్లో గ్రూప్-3 పరీక్షలు నిర్వహించనున్నట్లు టిఎస్పిఎస్సి (TSPSC )కమిషన్ వెల్లడించింది. ఈ మేరకు బుధవారం కీలక ప్రకటన విడుదల చేసింది.
•19 ఫిబ్రవరి 2024 న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. మొత్తం 563 గ్రూప్ 1 పోస్టులు ఉన్నాయి. వీటికి సుమారు ఐదు నుండి ఆరు లక్షల మధ్య అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.
• 2022 డిసెంబర్ లో 783 పోస్టులకు గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల చేశారు వీటికి 5,51,943 మంది దరఖాస్తు చేసుకున్నారు.
• ఇక గ్రూప్ 3 పోస్టుల భర్తీకి 2022 డిసెంబర్ 30న 1363 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా ఆ తర్వాత అదనంగా మరో 12 పోస్టులు కలిపి
మొత్తం 1,375 పోస్టులకు సుమారు 5.36 లక్షల మంది అప్లై చేసుకున్నారు.
https://websitenew.tgpsc.gov.in/
By Veeramusti Sathish
M.A. (Journalism & Mass Communication), M.A. (Political Science)
Independent Digital Journalist & RTI Activist | Founder – Prathipaksham TV
READ MORE:
TSPSC : గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు రద్దు- హైకోర్టు

