యూపీఎస్సీ అనుసరించిన విధానం ఉదాహరణ
న్యూ ఢిల్లీ: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) వందేళ్ల చరిత్రతో కూడిన సంస్థ. నోటిఫికేషన్లు, పరీక్షలు, ఇంటర్వ్యూల నిర్వహణలో పారదర్శకతకు నిలువెత్తు నిదర్శనం. ఈ మోడల్‌ను తెలంగాణలో అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
Thank you for reading this post, don't forget to subscribe!యూపీఎస్సీ అధికారులతో ముఖ్యమంత్రి భేటీ
న్యూ ఢిల్లీలోని UPSC కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి UPSC ఛైర్మన్ డాక్టర్ మనోజ్ సోని, కార్యదర్శి శశిరంజన్ కుమార్‌లను కలిశారు. టీఎస్పీఎస్సీ (TSPSC)లో మార్పులు, పారదర్శక విధానాలపై సుదీర్ఘంగా చర్చించారు.
https://www.tspsc.gov.in/
రెండు లక్షల నియామకాలు లక్ష్యం
2024 డిసెంబర్ నాటికి రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగ నియామకాలు చేపడతామని సీఎం తెలిపారు. ఇందుకోసం టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసి, అవినీతి రహితంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు.
అవకతవకలకు ముగింపు
గత ప్రభుత్వంలో టీఎస్పీఎస్సీని రాజకీయ ప్రభావం కోసం ఉపయోగించారని, పేపర్ లీకులు, నోటిఫికేషన్లలో ఆలస్యం, ఫలితాల లోపాల కారణంగా ఉద్యోగార్థులు తీవ్రంగా నష్టపోయారని రేవంత్ విమర్శించారు. ఇకపై రాజకీయ ప్రమేయం లేకుండా ఛైర్మన్, సభ్యుల నియామకం జరుగుతుందని హామీ ఇచ్చారు.
UPSC హామీ
స్పందించిన UPSC ఛైర్మన్ మనోజ్ సోని, టీఎస్పీఎస్సీ ఛైర్మన్, సభ్యులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి, సిబ్బందికి అవగాహన తరగతులు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు.