చిట్యాల,సెప్టెంబర్ 27 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులతో కిటకిటలాడింది. రేపు,ఎల్లుండి వరుసగా శని, ఆదివారాలు కావడంతో జనం భారీగా కనిపించారు. కొంతమంది డబ్బులు డ్రా చేసుకోవడానికి వస్తే.. మరికొందరు డబ్బులు పడ్డాయా లేదా అని చెక్ చేసుకువడాని, రుణాల రెన్యూవల్, సొమ్ము డిపాజిట్ చేసుకోవడానికి వినియోగదారులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అయితే వృద్ధులు, మహిళలు చాలాసేపు పడిగాపులు కాశారు, గంటల కొద్దీ నిలబడలేక అసహనం వ్యక్తం చేశారు..ఉదయం నుంచి సాయంత్రం వరకు బ్యాంక్ కిటకిటలాడింది. అయితే బ్యాంకు అధికారులు, సిబ్బంది నాణ్యమైన సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని వివిధ గ్రామాల నుండి వచ్చిన కొంత మంది వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ వెనుదిరిగారు.