
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో సెన్సిబుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లకు పేరుగాంచిన దర్శకుడు కె.విజయ్‌భాస్కర్ మరోసారి ప్రేమ, కుటుంబ బంధాలు, భావోద్వేగాలను మిళితం చేస్తూ సరికొత్త చిత్రాన్ని తెరపైకి తీసుకువస్తున్నారు. ఆయన స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘ఉషా పరిణయం’.
ఈ సినిమా టైటిల్‌కు సరిపోయేలా ఉపశీర్షికగా “Love is Beautiful” అనే లైన్‌ను జోడించారు. వాలెంటైన్స్ డే కానుకగా ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు.
‘ఉషా పరిణయం’ చిత్రంలో హీరోగా దర్శకుడు కె.విజయ్‌భాస్కర్ కుమారుడు శ్రీకమల్ నటిస్తున్నారు. హీరోయిన్గా అచ్చతెలుగమ్మాయి తాన్వీ ఆకాంక్ష పరిచయం అవుతోంది. ఫ్యామిలీ ఎమోషన్‌తో కూడిన లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం వాలెంటైన్స్ సీజన్లో సరికొత్త ఫీల్ ఇవ్వనుంది.
ఫస్ట్ లుక్ పోస్టర్లో హీరో, హీరోయిన్ల రొమాంటిక్ కెమిస్ట్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా పేరుగాంచిన ‘నువ్వే కావాలి’, ‘మన్మథుడు’, ‘మల్లీశ్వరి’ వంటి చిత్రాల తర్వాత కె.విజయ్‌భాస్కర్ తీస్తున్న ఈ సినిమా పట్ల ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.
ఇప్పటికే చిత్ర టాకీ పార్ట్ పూర్తయిందని, పాటల చిత్రీకరణ కోసం త్వరలో విదేశాలకు వెళ్ళనున్నట్టు యూనిట్ ప్రకటించింది.
ఈ చిత్రంలో సూర్య, రవి, శివతేజ, అలీ, వెన్నెల కిషోర్, శివాజీ రాజా, ఆమని, సుధ, ఆనంద్ చక్రపాణి, రజిత, బాలకృష్ణ, మధుమణి వంటి ప్రముఖులు నటిస్తున్నారు.
సంగీతాన్ని ఆర్.ఆర్. ధ్రువన్ అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ సతీష్ ముత్యాల, ఎడిటింగ్ ఎం.ఆర్. వర్మ నిర్వహిస్తున్నారు.
దర్శకత్వం, నిర్మాణం రెండింటినీ స్వయంగా కె.విజయ్‌భాస్కర్ నిర్వహిస్తున్నారు.
ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు యూత్‌ని కూడా ఆకట్టుకునే సాఫ్ట్ లవ్ ఎంటర్టైనర్గా నిలవనుందని యూనిట్ విశ్వాసం వ్యక్తం చేసింది.