జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఐదుగురు ఎస్సైలు బదిలీ అయ్యారు.అసెంబ్లీ ఎన్నికల తర్వాత జిల్లాలో పోలీస్ శాఖలో మొదటిసారిగా బదిలీలు జరిగాయి. ప్రస్తుతం కాటారంలో ప్రొబీషనరీ సర్వీస్‌లో ఉన్న కే ప్రసాద్‌ను మహాదేవపూర్ ఎస్.హెచ్.ఓ గా, ఇక్కడ ఎస్ఐ రాజకుమార్ ను భూపాలపల్లికి, మాధవ్‌ను రేగొండ నుండి మొగుళ్ళపల్లికి, ఎన్ రవికుమార్ ను భూపాలపల్లి నుండి రేగొండకు, శ్రీధర్ ను మొగుళ్లపల్లి పోలీస్ స్టేషన్ నుండి భూపాల్ పల్లి పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. దీంతో మిగతా సబ్ ఇన్స్పెక్టర్స్ లోనూ టెన్షన్ మొదలైంది అయితే ఇది సబ్ ఇన్స్పెక్టర్ వరకే పరిమితం అవుతుందా లేక డి.ఎస్.పిలు, సీఐలు కూడా ట్రాన్స్ఫర్ అవుతారా అని చర్చించుకుంటున్నారు.