• నిరుడు రూ.14 వేలు ధర పలికిన క్వింటాలు పత్తి
• ఇప్పుడు ప్రభుత్వ మద్దతు ధర రూ. 7,020
• సాకులు చెబుతూ ధరలో కోతలు
• రూ.6,500 మాత్రమే పెడుతున్న ప్రైవేటు వ్యాపారులు
వరంగల్ :నిరుడు రికార్డు స్థాయిలో పత్తికి 14000 ధర పలకడంతో ఈ సంవత్సరం రైతులు పత్తి సాగు వైపు మొగ్గు చూపారు కానీ ఈసారి మాత్రం ఏడు వేలే ధర ఉండడంతో రైతులు ఆందోళనలో ఉన్నారు. ఎకరా పత్తి సాగుకు సగటున రూ.30 నుంచి రూ.40 వేలు పెట్టుబడి,పత్తి ఏరుడుకు 15000 లు మొత్తం 50000 ఖర్చవుతుంది.ఎకరాకు 5-8 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఈ లెక్కన రైతుకు పెట్టిన పెట్టుబడి పోను ఏమి మిగిలే అవకాశం లేదు ఇక కౌలు రైతులు అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టి నష్టాల పాలు అయ్యారు ఈ నేపద్యంలో రూ.10 వేలుగా ప్రకటించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.