స్టోనెక్స్ బ్యానర్ పై పి బి వేలుమురుగన్ నిర్మాతగా,రామ్ ప్రభ దర్శకత్వంలో తెలుగు, తమిళ్, హిందీ భాషలలో నిర్మిస్తున్న చిత్రం
“గ్యాంగ్ స్టర్” గ్రానైట్ స్లాబులను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తూ వ్యాపార రంగంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నిర్మాత వేలు మురుగన్. సినీ పరిశ్రమపై ఉన్న మక్కువతో ఈ చిత్రాన్ని నిర్మించారు. మూడు భాషల్లో రూపుదిద్దుకుంటున్న “గ్యాంగ్ స్టర్” చిత్రం మార్చి నెలలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత వేలు మురుగన్ మాట్లాడుతూ మార్కెటింగ్ స్కామ్ అనే నూతన పాయింట్ పై సినిమా అంతా నడుస్తుంది. ఇప్పటి వరకు ఇలాంటి పాయింట్ పై సినిమా రాలేదని చెప్పాలి. ఇందులో హీరోలు ఎవరు? విలన్స్ ఎవరు? అనేది క్లైమాక్స్ వరకు తెలియదు. ప్రతి పాత్ర ఎంతో ఇంట్రస్టింగ్ గా క్యూరియాసిటీ కలిగించే విధంగా ఉంటుంది. దర్శకుడు రామ్ ప్రభ సినిమాను ఎంతో ఇంట్రస్టింగ్ గా తెరకెక్కించారు. ఇప్పటికే పలు చిత్రాల్లో నటించి ప్రస్తుతం మంచి చిత్రాల్లో నటిస్తోన్న ప్రజిన్ పద్మనాభన్ , జీవా మరియు విజయ్ విశ్వ ముఖ్య పాత్రలో నటించారు. అలాగే సాయిధన్య, మోహన సిద్ధి, షాలిని హీరోయిన్స్ గా పరిచయం చేస్తున్నాం. ముగ్గురు కూడా అందంతో పాటు అభినయంతో ఆకట్టుకుంటారు. ఆర్టిస్టులందరూ తమ పాత్రలకు తగ్గట్టుగా పోటీపడుతూ నటించారు. కచ్చితంగా ఈ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికీ `గ్యాంగ్ స్టర్`మంచి పేరు తెచ్చే సినిమా అవుతుంది అనడంలో సందేహం లేదు. తమిళంలో పలు హిట్ చిత్రాలకు పని చేసిన మనోజ్ కుమార్ బాబు మా సినిమాకు ఎక్స్ లెంట్ మ్యూజిక్ ఇచ్చారు. తన బీజీయమ్ తో సినిమాను నెక్ట్స్ లెవల్ కు తీసుకెళ్లారు. అలాగే ఎన్నో మంచి చిత్రాలకు పని చేసిన సురేష్ కుమార్ సుందరం గారు వండ్రఫుల్ సినిమాటోగ్రఫీ అందించారు. రవీంద్రన్ గారు వేసిన ఎయిర్ పోర్ట్ సెట్ సినిమాకే హైలెట్ గా నిలవనుంది. ప్రతి టెక్నీషియన్ ప్రాణం పెట్టి పని చేశారు. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ తో పాటు ఆరు అద్భతుమైన ఫైట్ సీక్వెన్స్ సినిమాకు హైలెట్ గా నిలుస్తాయి అనడంలో డౌటే లేదు.కథ, కథనాలు చాలా కొత్తగా ఉంటాయి అన్నారు.
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీః సురేష్ కుమార్ సుందరం; సౌండ్ ఎఫెక్ట్ః మదన్ రాజ్; సంగీతంః మనోజ్ కుమార్ బాబు; ఎడిటర్ః రామ్ నాథ్; ఆర్ట్ డైరక్టర్ః రవీంద్రన్; నిర్మాతః పి.బి.వేలు మురుగన్; రచన-దర్శకత్వంః రామ్ ప్రభ.