సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు 2018 అసెంబ్లీ ఎన్నికల ముందు సీఎం పదవి కోసం 5 వేల కోట్లు రూపాయలు సిద్ధం చేసి పెట్టుకున్నారని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ డబ్బు ఎక్కడ దాచి పెట్టారో వెలికి తీయాలని సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాస్తానని కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు కవిత,సంతోష్ కూడా కొన్ని వేల కోట్లు బ్లాక్ చేశారని ఆరోపించారు. ఒక్కరిని కూడా వదిలి పెట్టబోమని, బీఆర్ఎస్ హయాంలో అవినీతికి పాల్పడిన అందరి భాగోతం బయట పెడుతామని అన్నారు.
హరీష్ రావు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏతులు ,అపొజిషన్లో ఉన్నప్పుడు నీతులు చెబుతున్నారని తెలిపారు.హరీష్ రావు నిజంగా పాపాల భైరవుడు,పెద్ద డ్రామా ఆర్టిస్ట్ అని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి,ఉత్తమ్ కుమార్ రెడ్డి రివ్యూలు చేస్తుంటే హరీష్ రావుకు నిద్ర పట్టడం లేదని అన్నారు.
బీ.అర్.స్ ప్రభుత్వంలో ప్రజల సొమ్ము కేసీఆర్ అనుభవించారని మండిపడ్డారు.గత ప్రభుత్వ తప్పులన్నీ బయట పెడతాం..ఇది ఆరంభం మాత్రమే అని వార్నింగ్ ఇచ్చారు.కేసీఆర్ కుటుంబంపై ఐటీ,ఈడీ దాడులు జరగవని, కిషన్ రెడ్డిని రండ కేంద్రమంత్రి అంటే సైలెంట్‌గా ఉన్నాడని..కిషన్ రెడ్డికి పౌరుషం లేదు..కానీ రేవంత్ రెడ్డికి పౌరుషం ఉంది కాబట్టి పిసికేస్తుండని జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు.