తెలంగాణ హైకోర్టు నిర్వహించిన ఉద్యోగ నియామక పరీక్షలకు సంబంధించి అభ్యర్థులు దాఖలు చేసిన అభ్యంతరాలపై కీలక నిర్ణయం వెలువడింది. జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, రికార్డ్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించిన కొన్ని ప్రశ్నల ఆన్సర్ కీని సవరించారు. మరికొన్ని ప్రశ్నలకు అభ్యర్థులందరికీ ఒక మార్కు కేటాయించాలని నిర్ణయించారు.
ఈ మేరకు తెలంగాణ హైకోర్టు సెప్టెంబర్ 21న R.O.C. No. 1278/2025-RC నోటిఫికేషన్ జారీ చేసింది. 2026 జూన్ 24, 25, 28 తేదీల్లో నిర్వహించిన కంప్యూటర్ ఆధారిత పరీక్షలకు సంబంధించి అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం ఈ మార్పులు ప్రకటించారు.
జూనియర్ అసిస్టెంట్ పోస్టులో 7 ప్రశ్నలకు మార్పులు
జూనియర్ అసిస్టెంట్ పరీక్షకు సంబంధించి ఏడు ప్రశ్నల ఆన్సర్ కీని సవరించారు. నార్వే, ఇజ్రాయెల్, అల్టార్, E-20, కర్ణాటక, వెర్బ్, నైవ్ వంటి ప్రశ్నలకు సంబంధించిన సమాధానాల్లో మార్పులు లేదా అభ్యర్థులందరికీ ఒక మార్కు కేటాయింపు నిర్ణయించారు.
ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్ పోస్టులపై నిర్ణయం
ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుకు సంబంధించి రెండు ప్రశ్నలను పరిశీలించారు. ఆర్టికల్ 214 ప్రశ్నకు అభ్యర్థులందరికీ ఒక మార్కు ఇవ్వగా, మరో ప్రశ్నకు సరైన సమాధానాన్ని “I have forgotten”గా మార్చారు.
ఎగ్జామినర్ పోస్టుకు సంబంధించి నాలుగు ప్రశ్నల్లో మార్పులు చేశారు. 181, EBACD, “for”, “Accompany” ప్రశ్నలకు సంబంధించిన ఆన్సర్ కీ మార్పులు, అదనపు మార్కుల నిర్ణయాలు నోటిఫికేషన్లో ఉన్నాయి.
రికార్డ్ అసిస్టెంట్ పోస్టులో 5 ప్రశ్నలకు సవరణ
రికార్డ్ అసిస్టెంట్ పరీక్షలో ఐదు ప్రశ్నలకు సమాధానాలను మార్చారు. “Ran out”, “Diagnosis”, “Speaking”, “Exceptionally”, “By the People” ప్రశ్నలకు సంబంధించిన ఆన్సర్ కీని సవరించారు. వీటిలో ఒక ప్రశ్నకు అభ్యర్థులందరికీ ఒక మార్కు కేటాయించారు.
మిగిలిన అభ్యంతరాలు తిరస్కరణ
కొన్ని ఇతర ప్రశ్నలపై వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన హైకోర్టు, అవి సమర్థించదగినవి కావని పేర్కొంటూ తిరస్కరించింది. సంబంధిత ప్రశ్న IDలను అధికారిక నోటిఫికేషన్లో ప్రత్యేకంగా పొందుపరిచింది.
ఆమోదించిన అభ్యంతరాలకు రూ.100 రీఫండ్
తమ అభ్యంతరాలు పరిశీలించి ఆమోదించిన అభ్యర్థులకు, ఒక్కో అభ్యంతరానికి ఆన్లైన్లో చెల్లించిన రూ.100 రుసుమును తిరిగి చెల్లించనున్నట్లు తెలంగాణ హైకోర్టు తెలిపింది. అభ్యర్థులు తమ ప్రశ్న IDలు, ఆన్సర్ కీ మార్పులు, అదనపు మార్కుల వివరాలను హైకోర్టు అధికారిక నోటిఫికేషన్లో పరిశీలించుకోవచ్చు.
హైకోర్టు అధికారిక వెబ్సైట్ https://tshc.gov.in/
READ IN ENGLISH : https://prathipakshamtv.com/telangana-high-court-answer-key-revised/

